- Advertisement -
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌తో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బండ్ల నివాసానికి వెళ్లిన రేవంత్…దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న బండ్ల…త్వరలో మళ్లీ యాక్టివ్ కానున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల కోసం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేసేందుకు బండ్ల గణేష్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసే విధంగా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
బండ్ల గణేష్ పార్టీకి అందించే సేవల నేపథ్యంలో పార్టీ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు వ్యూహరచన చేసినట్లు సమాచారం. సినిమాల పరంగా కొంత బిజీగా ఉన్న బండ్ల గణేష్ మరో రెండు నెలల పాటు ఇండస్ట్రీకి సంబంధించి తన కార్యక్రమాలు పూర్తిచేసుకుని పార్టీకి పక్కా సమయం కేటాయించే విధంగా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
- Advertisement -