పాక్ క్రికెటర్‌ అలీపై సస్పెన్షన్

6
- Advertisement -

అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పాక్ ఆటగాడు హైదర్ అలీపై సస్పెన్షన్ వేటు వేసింది పీసీబీ. బ్రిట‌న్‌లో ఓ బాలిక‌ను రేప్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. ఈ కేసులో అత‌న్ని అరెస్టు చేసి, బెయిల్‌పై రిలీజ్ చేశారు. ఇంగ్లండ్‌లో పాకిస్థాన్ ష‌హీన్స్ జ‌ట్టు టూర్ చేస్తున్న స‌మ‌యంలో జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

రేప్ జ‌రిగిన‌ట్లు ఓ రిపోర్టు రావ‌డంతో క్రికెట‌ర్‌ను అరెస్టు చేసిన‌ట్లు గ్రేట‌ర్ మాంచెస్ట‌ర్ పోలీసులు తెలిపారు. కేసు విచార‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో అత‌నికి బెయిల్ మంజూరీ చేయగా హైద‌ర్ అలీని త‌క్ష‌ణ‌మే సస్పెండ్ చేస్తున్న‌ట్లు పీసీబీ పేర్కొంది.

పాకిస్థాన్ జాతీయ జ‌ట్టు త‌ర‌పున హైద‌ర్ అలీ రెండు వ‌న్డేలు, 35 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2020లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

Also Read:Hyd:యుఎస్‌ జనరల్‌గా లారా విలియమ్స్

- Advertisement -