ఏపీ అసెంబ్లీలో జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. జగన్ రాసిన లేఖపై స్పందించిన పయ్యావుల…జగన్ ముందుగా తన సలహాదారులను మార్చుకోవాలని హితవు పలికారు. చరిత్ర తెలియకపోతే తెలుసుకోవాలని సూచించారు. జగన్‌కు స్పీకర్‌కు లేఖ రాయాలని సూచించిన సలహాదారుల్ని మార్చాలని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ నిబంధనల ప్రకారం జగన్ కూ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదని ..ప్రతిపక్ష నేత హోదా రావడానికి జగన్ కు ఓ పదేళ్లు పడుతుందన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రావడానికి పదేళ్లు పట్టిందని గుర్తు చేశారు. స్పీకర్‌కు లేఖ రాయడం ద్వారా జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని, జగన్ తన ఖాతా పుస్తకాలతో పాటు శాసనసభ నిబంధనలు కూడా చదవాలన్నారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ ఇంకా గుర్తించలేదని….ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ ఏ సలహాదారు సూచనల మేరకు రాశారని పయ్యావుల ప్రశ్నించారు. 10 శాతం కూడా సభ్యులు లేకుండా హోదా ఎలా వస్తుందన్నారు.
Also Read:Varun Tej:మట్కా మేకింగ్ వీడియో