హంద్రీనీవా నీటి విడుదల కార్యక్రమంలో మాజీ సీఎం జగన్‌పై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రాయలసీమలో పేదలను అభివృద్ధి కాకుండా చేసి పాలెగాళ్ల రాజ్యం తేవాలి అనుకుంటున్నాడు అని ఆరోపించారు.
కానీ చంద్రబాబు రాయలసీమలో పొలాల్లో నీరు పారించి సీమ ప్రజలను అభివృద్ధి పరచాలి అనుకుంటున్నాడు అని తెలిపారు. జగన్‍కు సవాల్ చేస్తున్నాం… జగన్‍కు దమ్ముంటే రాయలసీమ అభివృద్ధిపై చర్చకు రావాలి అన్నారు.
Also Read:Bihar:ఫ్రీ కరెంట్..సీఎం నితీశ్ ప్రకటన
హంద్రీనీవా కాలువ గట్టుపై జగన్ చర్చకు రావాలి…. రాయలసీమ తలరాతను మార్చడానికి ఆనాడు ఎన్టీఆర్ హంద్రీనీవాకు శ్రీకారం చుట్టారు అన్నారు. ఆ బాధ్యతను సీఎం చంద్రబాబు పూర్తిచేశారు…. సీమను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు… రాయలసీమలో జగన్ పాలెగాళ్ల రాజ్యం తేవాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమకు జగన్ ఏం చేశారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.

