ఆ హీరోయిన్ ఐదేళ్లు డేటింగ్‌ చేసిందట

33
- Advertisement -

మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో తాను ఐదేళ్లు డేటింగ్‌లో ఉన్నానని నటి పాయల్ ఘోష్ వెల్లడించారు. ఆమె తన X అకౌంట్‌లో ఇర్ఫాన్‌తో ఉన్న ఫొటో షేర్ చేసి.. ‘మేము విడిపోయిన తర్వాత నేను అనారోగ్యానికి గురయ్యాను. కొన్నేళ్ల వరకూ నేను ఏ పనినీ చేయలేకపోయాను. కానీ ఆ సమయంలో నాకు ఇర్ఫాన్ పఠాన్‌ ఎలాంటి సపోర్ట్ చేయలేదు. నేను సాయం చేయమని కోరినా తను మాత్రం రియాక్ట్ కాలేదు. అయినప్పటికీ, నేటి వరకూ నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి పఠాన్ మాత్రమే. నేను నిజం చెబుతున్నాను. మా బ్రేకప్ తర్వాత నేను ఎవరినీ ప్రేమించలేదు.’ అని పాయల్ చెప్పుకొచ్చింది.

పాయల్ ఘోష్ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుతూ.. కాలేజ్ రోజుల్లో నేను మోడలింగ్ చేసేదాన్ని. అలాగే కొన్ని ఈవెంట్స్ చేయడం, మోడల్ గా వెళ్లడం నాకు అప్పటి నుంచే అలవాటు ఉందని పాయల్ ఘోష్ చెప్పుకొచ్చింది. నేను జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అప్పుడే సినిమాల్లోకి రావాలని ఆశ పడ్డాను. అదేంటో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఇబ్బందులు పడ్డాను. అందుకే, నేను సినిమాల్లో నటించడానికి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. కాగా నా సినిమాల విషయంలో అమ్మానాన్నలను ఒప్పించడం కొంచెం కష్టమైందని చెప్పింది.

ఏది ఏమైనా హీరోయిన్ గా ఎంట్రీ లోనే మంచి గుర్తింపు తెచ్చుకోలేక పోయింది పాయల్ ఘోష్. ఆ తర్వాత కూడా అమ్మడుకి అవకాశాలు రాలేదు. కాకపోతే, కొన్ని చిన్నాచితకా చిత్రాల్లో పాయల్ ఘోష్ కి అవకాశాలు వస్తున్నాయి. పాపం హీరోయిన్ రేంజ్ ఫిగర్ కాస్త.. చిన్న హీరోయిన్ గా మిలిగిపోయింది పాయల్. నటన పరంగా పాయల్ ఘోష్ లో ఎలాంటి వంక పెట్టలేం. కాకపోతే.. ఆమె అన్ని క్యారెక్టర్స్ కి సూట్ కాదు. అందుకే సైడ్ క్యారెక్టర్ గానే మిగిలిపోయింది.

Also Read:#N63…’బచ్చల మల్లి’

- Advertisement -