మహారాష్ట్ర రాజకీయలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శరత్ పవార్ రాజీనామా చేశారు. దేశ రాజకీయాల్లో శక్తివంతమైన నేతగా పేరున్న శరత్ పవార్ ఎన్సీపీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడం ఏంటనే చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. గత కొన్నాళ్లుగా ఎన్సీపీలో అసమ్మతి పెల్లుబుక్కుతోంది. ఆ పార్టీలోని చాలా ఎమ్మేల్యేలు శివసేన ( షిండే వర్గం ) తో టచ్ లో ఉన్నారనే వార్తలు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు ఆద్యం పోసేలా ఇటీవల షిండే వర్గానికి చెందిన మంత్రి ఉదయ్ మాట్లాడుతూ ఎన్సీపీకి చెందిన 20 మంది ఎమ్మేల్యేలు తమతో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు..
దాంతో అప్రమత్తం అయిన శరత్ పవార్ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఆయన పార్టీ అధ్యక్ష పదవికే రాజీనామా చేయడంతో అసలు ఎన్సీపీలో ఏం జరుగుతోందనే చర్చ ఊపందుకుంది. అయితే ఎన్సీపీలో ప్రదీప్ పవార్ గత కొన్నాళ్లుగా పార్టీ మారతారని వార్తలు వస్తున్నాయి. ఈయన తరచూ బీజేపీతో టచ్ లో ఉంటున్నారని, ఈయనతో పాటుగా మరికొంత మంది ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పించేందుకు వ్యూహాలు పన్నుతున్నారని నేషనల్ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.
Also Read: కాంగ్రెస్ మేనిఫెస్టో.. బీజేపీకి షాక్ !
దాంతో శివసేన పార్టీలో షిండే ద్వారా ఉద్దవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చి శివసేనను రెండుగా చీల్చిన బీజేపీ.. ఎన్సీపీ విషయంలో కూడా ఇదే ప్రణాళికను అమలు చేయబోతుందా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ తో కలిసిమెలిసి తిరిగిన శరత్ పవార్.. అనూహ్యంగా కాంగ్రెస్ కు దూరమై బీజేపీకి దగ్గరయ్యారు. దీంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( ఎన్సీపీ ) రెండు ముక్కలవుతుందనే భయంతోనే శరత్ పవార్ బీజేపీకి దగ్గరయ్యరనే వాదన కూడా వినిపించింది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో తాజాగా శరత్ పవార్ ఏకంగా అధ్యక్ష పదవి నుంచే తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. శరత్ పవార్ ప్రసిడెంట్ పదవి నుంచి తప్పుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఉందనేది ఇంటర్నల్ గా వినిపిస్తున్న మాట. మరి తదుపరి ఎన్సీపీ సారథి ఎవరు అనేది ఆసక్తికరం.
Also Read: పాక ఇడ్లీ తిన్న వెంకయ్య..అద్భుతం అంటూ కితాబు