ఇంటర్వెల్‌ ముందు సీన్‌కు పవన్‌ స్పూర్తి…

227
pawans-inspiration-baahubali2-itervel-scene
pawans-inspiration-baahubali2-itervel-scene
- Advertisement -

ఓ వైపు బాహుబలి, మరోవైపు భళ్లాలదేవ… వీళ్ల మధ్య కట్టప్ప, శివగామి, దేవసేన… ఈ పాత్రల్ని సృష్టించిన కథకుడు, ‘బాహుబలి’ సృష్టికర్త… విజయేంద్రప్రసాద్‌. దర్శకుడిగా రాజమౌళి అప్రతిహత విజయ యాత్రకు మూలం… విజయేంద్రుడి కథలే. వెండి తెరపై కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న “బాహుబలి: ది కన్ క్లూజన్” గురించి ఓ పత్రికతో మాట్లాడారు విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమా విశ్రాంతి ముందు వచ్చే సన్నివేశానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు స్ఫూర్తి అని వెల్లడించారు.

bahu

‘‘బాహుబలి 2’ విశ్రాంతి ఘట్టం ఎలా ఉండాలి? అనే విషయంలో చాలా రకాలుగా ఆలోచించాం. ‘భళ్లాల దేవుడికి పట్టాభిషేకం జరుగుతుంది.. కానీ సంతృప్తిగా ఉండలేడు. బాహుబలికి జనం పడుతున్న నీరాజనాలు చూసి అసూయతో రగిలిపోతాడు…’ ఇదీ మేం అనుకొన్న కాన్సెప్ట్‌. దాన్ని ఎలా చూపించాలా? అని తర్జనభర్జనలు పడుతున్న సమయంలో అనుకోకుండా టీవీ చూశా. ఏదో ఆడియో ఫంక్షన్‌ జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌ అక్కడ లేడు. కానీ.. పవన్‌ పేరు పలికినప్పుడల్లా… జనం వెర్రిగా వూగిపోతున్నారు. ఐదు నిమిషాల పాటు ఎవరేం మాట్లాడినా వినిపించడం లేదు. ఆ సమయంలో వేదికపై ఎవరున్నా, హీరో ఎవరైనా సరే… అసూయ పడాల్సిందే. ‘ఇదేదో బాగుంది కదా’ అనుకొన్నాం. వెంటనే… ఆ సన్నివేశం రాసేశా. ఆ విధంగా విశ్రాంతి ఘట్టానికి పవన్‌ కల్యాణే స్ఫూర్తినిచ్చాడని’’ విజయంద్ర ప్రసాద్ అన్నారు.

- Advertisement -