జనసేనకు దమ్మున్న నాయకులు కావాలి….!

239
pawan’s chenetha satyagraham
- Advertisement -

జనసేన అధినేత పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ ఈ మధ్య రాజకీయాలపై జోష్ పెంచినట్లు కనిపిస్తుంది. నిన్న ఏర్పాటు చేసిన చేనేత సత్యాగ్రహం భారీ బహిరంగ సభలో మాట్లాడిన పవర్‌స్టార్‌  కొంత ఉద్రేకానికి లోనైయ్యారు. నేతన్నను అదుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలం చెందిదని ఆయన అన్నారు.

pawan’s chenetha satyagraham

నేత కార్మికులపై మాట్లాడిన జనసేన చీప్‌ పవన్‌కళ్యాణ్‌……చేనేతన్నలను కార్మికులు అంటే ఊరుకోనని, చేనేత కళాకారుడంటేనే ఒప్పుకొంటానని పవన్ అన్నారు. చిన్నతనంలో తాను చీరాలలో ఉండేవాడినని, అప్పుడు తమ ఇంటి పక్కన చేనేత కుటుంబాలుండేవని చెప్పారు. వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో, వాళ్లు పస్తులు ఎలా ఉంటారో, స్కూలు ఫీజులు కట్టడానికి పడే ఇబ్బందులు, క్యారేజిలో అటుకుల్లాంటివి మాత్రం తెచ్చుకోవడం అన్నీ తనకు గుర్తున్నాయని తెలిపారు.

జనసేన పార్టీని పూర్తిస్థాయిలో నిర్మించరా అని పలువురు నన్ను అడుగుతున్నారు. మీరంతా ఉండగా మళ్లీ నిర్మాణం ఎందుకు?’ అని పవన్‌ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే జనసేన నిర్మాణాన్ని కూడా కొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి అధికారం ఆశించి రాలేదని పవన్‌ మరోసారి స్పష్టం చేశారు. కష్టాలతో సహజీవనం చేసే వారికి అండగా ఉండటానికే జనసేన పార్టీని స్థాపించానట్లు పవన్‌ వెల్లడించారు. వచ్చే 2019 ఎలక్షన్స్‌లో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని పవన్‌ ప్రకటించారు.
pawan’s chenetha satyagraham
జనసేనకు దమ్మున్న నాయకులు,…ధైర్యంగా నిలబడి పోరాడేవాళ్లు కావాలి అని పవన్ అన్నారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకిని కాదని అయితే దానిని అడ్డు పెట్టుకొని అనర్హులు అందలమెక్కాలని చూస్తే వ్యతిరేకిస్తానని పవన్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎలక్షన్స్‌లో ప్రజల సహాయ సహాకారాలతోనే జనసేన మేనిఫెస్టోని రూపొందిస్తామని పవన్‌ ప్రకటించారు. రాజకీయాలంటే కొంతమంది మురుగు కూపం అంటున్నారు. కానీ నాకు మాత్రం రాజకీయాలంటే ఎంతో గౌరవం అని పవన్‌ ఈ సందర్భంగా అన్నారు. నాకు ఎవరి సంపాదన అవసరం లేదు, కేవలం ప్రజలు నా సినిమా టికెట్‌కు చెల్లించే రూపాయి మీద జీవిస్తున్నానని జనసేన అధినేత  చెప్పుకొచ్చారు.

- Advertisement -