స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉంది అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
2024 ఎన్నికల్లో NDA కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత టీడీపీ ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ తొలి మహానాడు సందర్బంగా 12వ సారి తెలుగుదేశం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక అభినందనలు చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను ‘సైబరాబాద్’గా మార్చి, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, డెల్ వంటి గ్లోబల్ ఐటీ దిగ్గజాలను ఆకర్షించారు. 1999లో “ఆంధ్రప్రదేశ్ విజన్ 2020” పత్రాన్ని రూపొందించి, ఆర్థిక సంస్కరణలు మరియు సాంకేతికత ఆధారిత అభివృద్ధి వైపు పయనింపచేశారు అన్నారు.
ఆయన అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశాభివృద్ధికి మీరు మరింత కృషి చేయాలనే ఆకాంక్షతో, ఈ నూతన భాద్యతల్లో మీకు అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటున్నాను అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు పవన్.
Also Read:తెలుగు రాష్ట్రాలు..భారీ వర్షసూచన

