పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె కుమారుడు అకీరా,కుమార్తె ఆధ్య సమక్షంలో రేణూ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. రేణూ ఎంగేజ్మెంట్పై పవర్ స్టార్ ఫ్యాన్స్ మిశ్రమ స్పందన వ్యక్తం చేయగా పవన్ మాత్రం బెస్ట్ విషెస్ తెలిపారు.
జీవితంలో సరికొత్త సంతోషాన్ని ఆస్వాదించేందుకు అడుగులు వేస్తున్న రేణూకు శుభాకాంక్షలు అని ట్వీట్టర్లో ట్వీట్ చేశారు. కుమారి రేణు గారు… సంతోషం కోసం కొత్త దశలోకి ప్రవేశిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని నేను భగవంతుడిని, ప్రకృతీమాతను కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.
అయితే జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలపై స్పష్టత ఇవ్వకపోయినా.. ఎంగేజ్ మెంట్ జరిగిన విషయాన్ని మాత్రం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది రేణూ దేశాయ్.
తెలుగులో పవన్‌కు జోడీగా ‘జానీ’, ‘బద్రీ’ సినిమాల్లో నటించింది రేణు. 2009లో పెళ్లిచేసుకోగా వీరికి అకీరా,ఆద్య ఇద్దరు పిల్లలు. 2012లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్..ఆన్నా లెజ్నోవా అనే రష్యా యువతిని పెళ్లిచేసుకున్నారు.
My wholehearted wishes to Ms.Renu garu for entering a new phase of happiness.I wish and pray Almighty & the Mother Nature to bestow upon her abundant health, peace and prosperity.
— Pawan Kalyan (@PawanKalyan) June 26, 2018