‘వినోదయ సీతం’ స్టార్ట్.. పవన్ డేట్స్ ఫిక్స్

37
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ సినిమా వినోదయ సీతంను తెలుగు లోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు, ‘శంభో శివ శంభో’ సినిమా డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా ఈరోజు హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభించినట్టు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ పై కీలక సీన్స్ ను షూట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ ఓ గెస్ట్ అపీరెన్స్ లో కనపడనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ లో భాగం అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా వదిలిన అనౌన్సమెంట్ పోస్టర్ లో కూడా పవన్ సూపర్ స్టయిలిష్ లుక్స్ లో బాగున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించిన అప్ డేట్ వైరల్ అవుతుంది.

అన్నట్టు ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తం 22 రోజులు పాటు డేట్స్ ఇచ్చాడు. ఈ 22 రోజులకు గానూ పవన్ కళ్యాణ్ మొత్తం ముప్పై ఐదు కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే లాభాల్లో 20 పర్సెంట్ లాభాన్ని కూడా మేకర్స్ ఒప్పదం కుదుర్చుకున్నారట. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తోందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -