- Advertisement -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక ప్యాకేజీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమని వెల్లడించారు.
ఈ మేరకు ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఆత్మనిర్భర్ భారత్ దిశగా మోదీ దృక్పథం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బలమైన స్తంభాలలో ఒకటిగా ఉంటుందని హామీ ఇచ్చారు.
1966లో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించిన అమృతరావు, వేలాది మంది త్యాగం మన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుందని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.
Also Read:చాగంటికి అవమానం..ఖండించిన టీటీడీ
- Advertisement -