ఫ్యాన్స్‌కు కాటమరాయుడు థ్యాంక్స్‌

216
Pawan Thanks to Fans
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. పవన్ పక్కా మాస్ లుక్ లో ఫ్యాక్షనిస్ట్ గా కనిపిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఇప్పటివరకు పోస్టర్స్, ఫస్ట్ లుక్‌ మాత్రమే విడుదల చేసిన పవన్‌ … కాటమరాయుడి టీజర్‌తో యూట్యూబ్‌ని షేక్ చేశాడు. ఇప్పటివరకు ఓ లెక్క … టీజర్ వచ్చాక మరో లెక్క అన్నట్లుగా పవర్‌ మానియాతో  యూట్యూబ్ రికార్డ్స్ బద్దలవుతున్నాయి.

పవన్‌ సృష్టించిన ఫివర్‌తో సోషల్ మీడియాలో వైబ్రేషన్స్ క్రియేటైపోయాయి. ప్రస్తుతం కాటమరాయుడు టీజర్ యూట్యూబ్‌లో నెంబర్ 1 ట్రెండింగ్‌గా దూసుకుపోతోంది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు. టీజర్ విడుదల చేసిన కొద్దిగంటల్లోనే 50 లక్షల వ్యూస్ సంపాదించి టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెబుతు పవన్‌ ఉన్న పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

దీంతో పాటు ఇప్పటివరకు మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 మూడు గంటల 5 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ సంపాదించగా కాటమరాయుడు కేవలం 2 గంటల్లోనే పది లక్షల వ్యూస్ సంపాదించింది. ఇక సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి టీజర్ రికార్డును కూడా కాటమరాయుడు కుమ్మేశాడు. కబాలి టీజర్ కు 2 మిలియన్ల వ్యూస్ ను అందుకునేందుకు 8 గంటల సమయం పట్టగా.. కాటమరాయుడు మాత్ర కేవలం 5 గంటల 23 నిమిషాల్లోనే ఈ ఫీట్ సాధించేశాడు. దీంతో కబాలి ని మించేసిన కాటమరాయుడు అంటూ మెగా ఫాన్స్ జోరుగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా 5 మిలియన్ వ్యూస్‌ను కొద్దిగంటల్లోనే రీచై సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన పవన్ కాటమరాయుడిపై అంచనాలు అమాంత పెరిగిపోయాయి. వేసవి కానుకగా కాటమరాయుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

- Advertisement -