జగన్ స్కామ్ లే టార్గెట్ గా జనసేన?

35
- Advertisement -

ఏపీలో అధికార వైసీపీ మరియు విపక్ష జనసేన పార్టీల మద్య రాజకీయ యుద్దమే జరుగుతోంది. ఈ మద్య ప్రతి అంశంలోనూ వైసీపీ ని టార్గెట్ చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వాలెంటరీ వ్యవస్థపై మరియు విద్యా వ్యవస్థపై జాబ్ క్యాలెండర్ పై పవన్ సంధించిన ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో ఏ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా వాలెంటరీ వ్యవస్థపై పవన్ చేసిన ఆరోపణలు జగన్ సర్కార్ కు ఇప్పటికీ కూడా కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ చేస్తున్న స్కామ్ లను తెరపైకి తెచ్చేందుకు అడుగులు వేస్తోంది జనసేన పార్టీ. .

ఇప్పటివరకు 1,402,58 ఎకరాల్లో 50 వేల 793 మంది పేదలకు పక్కా ఇల్లు మజూరు చేశామని ఇటీవల కృష్ణయ్యపాలెంలో సి‌ఎం జగన్ వ్యాఖ్యానించారు. అయితే ఇళ్ల పంపిణీలో చాలానే లొసుగులు ఉన్నాయని చాలా కుంభకోణం జరిగిందని జనసేన పార్టీ చెబుతోంది. అందుకే ఇళ్ల పంపిణీలో ముఖ్యంగా జగనన్న కాలనీల పేరుతో జరుగుతున్నా స్కామ్ లను బయట పెట్టాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యకర్తలకు చెప్పుకొచ్చారు.

Also Read:‘ఖుషి’ ఫస్ట్ సింగిల్..వంద మిలియన్ల వ్యూస్‌

వాటికి సంబంచించి ఎటువంటి స్కామ్ లనైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని నాదెండ్ల జనసైనికులకు చెప్పుకొచ్చారు. గతంలో రోడ్ల విషయంలో ఇదే విధంగా సోషల్ మీడియా క్యాంపైన్ చేసి జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టింది జనసేన పార్టీ. మళ్ళీ ఇప్పుడు జగనన్న కాలనీలపై సోషల్ మీడియా క్యాంపైన్ చేపట్టింది జనసేన పార్టీ. దీంతో మరోసారి వైసీపీకి జనసేన గట్టిగానే స్ట్రోక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి వైసీపీ టార్గెట్ గా జనసేన చేస్తున్న ప్రయత్నాలు మంచిగానే సక్సస్ అవుతున్నాయనే చెప్పవచ్చు.

Also Read:ప్రాణనష్టం జరగకుండా చూడడండి.. సీఎం ఆదేశం

- Advertisement -