ఈ మద్య పవన్ కల్యాణ్ తరచూ తన ప్రసంగాల్లో స్టార్స్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. తాను ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లా డ్యాన్స్ లు చేయలేనని, మహేష్, ప్రభాస్ లా తాను పాన్ ఇండియా స్టార్ కాదని తనను తాను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో పవన్ ఇతర వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు, కానీ ఈ మద్య మాత్రం స్టార్స్ ప్రస్తావన తీసుకోస్తూ.. అందరి హీరోలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తామంతా ఒక్కటేనని చెప్తూ అందరి అభిమానుల మద్దతు తనకు కావాలని పవన్ వ్యాఖ్యానిస్తున్నారు..
వారాహి యాత్రలో భాగంగా ఇతర వ్యాఖ్యలు చేసిన పవన్ తాజాగా తాన కొత్త సినిమా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా స్టార్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ విధంగా పోలిటికల్ స్టేజ్ పైన అలాగే మూవీస్ స్టేజ్ పైన పవన్ ఇతర వ్యాఖ్యలు చేయడం వెనుక వ్యూహం ఉందనేది విశ్లేషకులు చెబుతున్నా మాట. సినీ రంగానికి పోలిటికల్ రంగానికి అభినవ సంబంధం ఉందనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. అందుకే రాజకీయ అగ్రనేతలు కూడా అప్పుడప్పుడు సినీ గ్లామర్ ను వాడుకుంటూ ఉంటారు.
Also Read:పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నాజర్
అయితే పవన్ మాత్రం సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఇంతవరకు గతంలో సినీ ఇండస్ట్రీ గురించి స్టార్ హీరోల గురించి ప్రస్తావించింది లేదు. అయితే ఈసారి ఎన్నికలు పార్టీకి కీలకం కానున్న నేపథ్యంలో తనను తాను తగ్గించుకుంటూ అందరి హీరోల అభిమానులను ఆకర్షిస్తున్నాడు పవన్. ఇప్పటికే ఆయా అభిమానుల హీరోలు పవన్ పై సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఇక మున్ముందు కూడా ఇదే తరహాలో తామంతా ఒకటేననే భావనను కలిగిస్తూ అందరి హీరోల అభిమానుల ఓట్లను తనవైపు మళ్లించుకునే పనిలో ఉన్నాడు పవన్. మరి ఆయన స్ట్రాటజీ ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి.
Also Read:#D51 అనౌన్స్ మెంట్