సినిమాను సినిమాలా చూడండి!

1
- Advertisement -

అభిమానులకు చిన్న దెబ్బ తగిలితే నా గుండెకు గాయం అవుతుంది అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినిమాను సినిమాలా చూడండి…కిందపడి, తొక్కిసలాటలు జరిగి హీరోను చూడాల్సిన అవసరం లేదు అన్నారు. అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లాలని చేతులెత్తి నమస్కరిస్తున్నా అన్నారు.

‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన పవన్…తండ్రి మెగాస్టార్ అయితే.. కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు అన్నారు. చరణ్‌లో చాలా గొప్ప నటుడు ఉన్నాడు..చిరంజీవి వారసుడు అలా కాకపోతే ఇంకా ఎలా ఉంటాడు? అన్నారు.

చరణ్ నాకు ఎప్పుడూ ఒక తమ్ముడిలాగా… చరణ్‌ను చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని అన్నారు. రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణతో ఉండేవాడు అన్నారు. పవన్ ఎప్పుడూ మూలాలు మర్చిపోడని,,, కళ్యాణ్ బాబు, ఓజీ, డిప్యూటీ సీఎం అని ప్రేక్షకులు ఏది అనాలన్నా అనొచ్చు …అన్నిటికీ ఆద్యుడు ఆయనే అన్నారు.

Also Read:రైతు భరోసా 15 వేలు కాదు 12 వేలే!

- Advertisement -