బాలయ్యకు పవన్ విషెస్

0
- Advertisement -

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో బాలకృష్ణ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్యకు డిప్యూటీ సీఎం పవన్ శుభాకాంక్షలు తెలిపారు.బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న బాలయ్యకు శుభాకాంక్షలు అని తెలిపారు.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన బాలయ్యకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు.

 

Also Read:BCCI:ఆ ఇద్దరి రిటైర్మెంట్‌పై శుక్లా!

- Advertisement -