మెగాస్టార్ చిరంజీవి 62వ జన్మదిన వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి.తెలుగు రాష్ట్రాల్లో చిరు అభిమానులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రక్తదానం, రోగులకు పాలు పండ్లు పంపిణీ చేసి చిరుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇక పలువురు ప్రముఖులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగా హీరోలు రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిర్మాత అల్లు అరవింద్లు కలిసి ఫ్యాన్స్ సమక్షంలో చిరు బర్త్ డే వేడుకని గ్రాండ్ గా జరిపారు. ఇక ఈ వేడుకలోనే చిరంజీవి 151వ మూవీ సైరా మోషన్ పోస్టర్ విడుదల కావడంతో అభిమానుల ఆనందం పతాక స్థాయికి వెళ్ళింది.
అయితేపవన్ కళ్యాణ్ మాత్రం వేడుకకి హాజరు కాకపోగా, కనీసం సోషల్ మీడియాలోను తన అన్నయ్యకి విషెస్ చెప్పలేదని ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. కానీ వారందరికి ఖుషీచేస్తూ మెగా కాంపౌండ్ నుంచి తీయని కబురందింది. అన్నయ్య చిరుని ఫస్ట్ విష్ చేసింది పవన్ కల్యాణేనట. ఉదయాన్నే చిరు ఇంటికి వెళ్లి తన అన్నయ్యకి విషెస్ చెప్పడంతో పాటు కొద్ది సేపు టైం స్పెంట్ చేశాడట. ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారట. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ వార్తతో ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు.