- Advertisement -
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు.ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన వన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరుపై మొదటి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి రెండవ సంతకం చేశారు.
ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పవన్ వెంట మెగా బ్రదర్ నాగబాబు, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
Also Read:Revanth:రుణమాఫీ డేట్ ఫిక్స్!
- Advertisement -