మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-సమంత హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్ధలం. ప్రపంచ వ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. ముఖ్యంగా చెవిటి వాడిగా చెర్రీ పండించిన కామెడీ సినిమాకే హైలైట్. రామ్ చరణ్ నటనకు వందనం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఇక టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం చెర్రీ నటన అద్భుతమని కొనియాడుతున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాని…చిట్టిబాబుగా చెర్రీ అదరగొట్టాడని ట్వీట్ చేశారు. రామ్ చరణ్ నటన అద్భుతం… సుకుమార్ దర్శకత్వ శైలి, మైత్రి మూవీ మేకర్స్, ఆర్ట్ డైరెక్టర్ నవీన్ రంగస్థలం సినిమాని విజయ పథంలో నడిపించారని ట్వీట్ చేశారు పవన్.
రంగస్థలం అదిరిపోయింది… ఇదే మాట చిట్టిబాబుకి వినపడేలా అరిచి చెప్పండి అంటూ ట్వీట్ చేశారు నాని. చిట్టిబాబు చించేశాడు… రామ్‌చరణ్ కెరీర్‌లో గొప్ప సినిమా అవుతుందన్నారు దర్శకుడు మారుతి.సమంత, ఆది పినిశెట్టి ఉత్తమ ప్రదర్శన కనబర్చారు. సుకుమార్ టేకింగ్ సూపర్బ్ అంటూ కొనియాడారు.