Pawan:పారదర్శక పాలన అందిస్తున్నాం

1
- Advertisement -

గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం అంత ఈజీ కాదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. కృష్ణా జిల్లా కంకిపాడులో సోమవారం నిర్వహించిన పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో మాట్లాడిన పవన్…గత వైసీపీ పాలనలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.

పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని…చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా బలమని కొనియాడారు. నాయకుడి అనుభవం ఉపయోగించుకోకపోతే తప్పుచేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు. అందుకే కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. ఆగస్టు 23న రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించామని తెలిపారు.

మా పేరుతో ఓ అధికారి కాకినాడలో డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ఏ అధికారి అయిన తప్పు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమలాగే అధికారులు కూడా పారదర్శకంగా ఉండాలని సూచించారు.

Also Read:చంద్రబాబుతో చిరు

- Advertisement -