అన్నవరంలో పవన్‌..వారాహికి ప్రత్యేక పూజలు

88
- Advertisement -

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ తలపెట్టిన యాత్ర తొలి షెడ్యూల్ జూన్ 23 వరకు ఖరారుకాగా పది రోజులు తొమ్మిది నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు.కత్తిపూడి వద్ద వారాహి విజయ యాత్ర తొలి బహిరంగ సభ‌లో ప్రసంగం చేయనున్నారు పవన్.

అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. పవన్ రాకతో అన్నవరం కిటకిటలాడింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి సెంటర్‌ వద్ద బహిరంగ సభ అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుంది.

Also Read:హైదరాబాద్‌కు అమిత్ షా..షెడ్యూల్ ఇదే

ఏపీలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో యాత్ర జరగనుండగా ఇప్పటికే పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisement -