విప్లవ యోధునికి జనసేన సెల్యూట్‌..

917
- Advertisement -

క్యూబా విప్లవయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,క్యుబా మాజీ ఫిడెల్‌ క్యాస్ట్రో మృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించిన పవన్ మహా నేత ఫెడల్‌ క్యాస్ట్రో నేడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లారని ట్విట్ చేశారు. ప్రజల్లో స్పూర్తిని నింపిన నాయకుడికి జనసేన సెల్యూట్ చేస్తోందని పేర్కొన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. ఫిడెల్‌ క్యాస్ట్రో ప్రవేశ పెట్టిన అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా క్యూబన్ల ప్రజారోగ్యం కోసం ఎంతగానో కృషి చేశారని పవన్ కొనియాడారు. తాము అమితంగా ఆరాధించే చెగువేరాతో ఫెడల్‌ క్యాస్ట్రో కలిసి సాగించిన పోరాటాన్ని.. ఈ సందర్భంగా మననం చేసుకుంటున్నామని తెలిపారు.

ఇక తన ప్రసంగాల్లోను.. సినిమాల్లోను.. చెగువేరా ప్రస్తావన తీసుకురావడానికి పవన్ ఇష్టపడుతుంటాడు. అందుకే.. ఆయన సినిమాల్లో కొన్ని చోట్ల చెగువేరా బొమ్మలు దర్శనమిస్తాయి. ఇక ప్రసంగాల్లో అయితే చెగువేరా పోరాట పటిమ గురించి పవన్ మాట్లాడిన సందర్బాలు చాలానే ఉన్నాయి.

pawan

మరోవైపు ఫెడల్‌ క్యాస్ట్రో అంత్యక్రియలు డిసెంబర్‌ 4న నిర్వహించనున్నట్లు క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. అలాగే.. ఇవాళ్టి నుంచి తొమ్మిది రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యూబాలోని చారిత్రాత్మక నగరం శాంటియాగోలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

Pawan pays homage to Fidel Castro

సంతాప దినాలుగా నిర్వహిస్తున్న తొమ్మిది రోజుల పాటు దేశంలో అన్ని కార్యకలాపాలు, ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. అలాగే సంతాప సూచకంగా ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాల్లో జాతీయ జెండా సగం ఎత్తులో ఎగురుతుందని తెలిపారు.

- Advertisement -