బీజేపీలో జనసేన విలీనం..స్పందించిన పవన్‌

410
pawan janasena
- Advertisement -

బీజేపీలో జనసేనను కలపడం లేదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్‌. తానా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన పవన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై స్పష్టతివ్వమని కోరుతున్నానే తప్ప వ్యక్తిగతంగా బీజేపీతో తనకు సమస్య లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలని బలమైన కోరిక ఉంటే తానే కాదు..ప్రస్తుత ప్రభుత్వం సహా ఎవరైనా సరే దాని కోసం పోరాడాల్సిందేనన్నారు. అమెరికా, ఐరోపా, గల్ఫ్‌ దేశాల్లో త్వరలో పర్యటిస్తానని చెప్పారు. అక్కడ తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు.

దెబ్బలు తిన్నా,ఓడిపోయినా ప్రజలకు అండగా నిలవాలన్న సంకల్పంతో మొదలైన నా ప్రయాణం ఆగదని స్పష్టం చేశారు. నా మొదటి సినిమా పరాజయం పాలైనప్పుడు ఇంతమంది అభిమానులను పొందుతానని ఎవరైనా ఊహించారా..? జనసేనా అంతే అన్నారు.

- Advertisement -