పవన్ ను భయపెడుతున్న సెంటిమెంట్ ?

51
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాస్త పాలిటిక్స్ కు బ్రేక్ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తున్నారు పవన్. వినిదయ సీతాం రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, మూవీ షూటింగ్స్ ను ఇప్పటికే ప్రారంభించిన పవన్ తాజాగా ” ఓ.జీ ” మూవీని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఇక వీటితో పాటు ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ” హరి హర విరమల్లు ” కూడా లైన్ లో ఉంది. ఇలా క్షణం తీరిక లేకుండా షూటింగ్స్ తో గడిపేస్తున్నారు పవన్. అయితే పవన్ ను ఇప్పుడొక సెంటిమెంట్ భయపెడుతోందట. అదే తాజాగా షూటింగ్ ప్రారంభం అయిన ” ఓ.జీ ( ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ) ” మూవీ. ఈ మూవీ కి పవన్ వీరాభిమాని అయిన సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా గ్యాంగ్ స్టార్ మూవీ గా సుజిత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన వీడియో ద్వారా తెలుస్తోంది.

Also read: బీజేపీ వైసీపీ దోస్తీ.. నో నో !

సుజిత్ దర్శకత్వం వహించిన గత చిత్రం సాహో మూవీలో కూడా కొంత గ్యాంగ్ స్టర్ షేడ్స్ కనిపిస్తాయి. కానీ పవన్ తో తీస్తున్న ఓ.జీ మూవీ మాత్రం కంప్లీట్ గ్యాంగ్ స్టర్ మూవీ అనే టాక్ వస్తోంది. కాగా పవన్ గ్యాంగ్ స్టర్ మూవీస్ చేయడం కొత్తేమీ కాదు, గతంలో బాలు, పంజా వంటి సినిమాలు చేశారు. అయితే ఈ రెండు మూవీస్ కూడా ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడిదే టెన్షన్ పవన్ అభిమానుల్లో నెలకొందట. బాలు, పంజా మూవీస్ లో పవన్ స్టైలిష్ గా కనిపించినప్పటికి స్టోరీ పరంగా వీక్ గా ఉండడంతో ఫ్లాప్ గా నిలిచాయి. దాంతో ఓ.జీ మూవీ స్టోరీ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టిన పవన్ ఖాతాలో మరో ఫ్లాప్ తప్పదనే భయం అభిమానుల్లో కనిపిస్తోంది. అంతే కాకుండా పవన్ ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా ఉండడంతో అధిక వైలెన్స్ ను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా ? అనేది కూడా అభిమానులను కలవరపెడుతున్న అంశం. మరి వీటన్నిటికి దృష్టిలో పెట్టుకొని సుజిత్ ” ఓ.జీ ( ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ) ” మూవీ ని ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.

Also read: చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ సొంతం..

- Advertisement -