పవన్ స్ట్రోక్ తో బీజేపీకి మైండ్ బ్లాక్?

48
- Advertisement -

ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు టిడిపితో కలిసి వెళ్తామని, టీడీపీ జనసేన పొత్తులో ఉంటాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల స్పష్టం చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇన్ని రోజులు తమ పొత్తు బీజేపీతోనే నని చెపుతూ వచ్చిన పవన్.. టీడీపీతో దోస్తీ పై మాత్రం సైలెన్స్ వహిస్తూ వచ్చారు. కానీ తాజాగా ఓపెన్ అవ్వడంతో ముఖ్యంగా బీజేపీ ఉలికిపాటుకు గురవుతోంది. ఎందుకంటే తమ అధికారిక మిత్రపక్షం జనసేన మాత్రమేనని, టీడీపీతో పొత్తు లేదని చెబుతూ వచ్చారు కమలనాథులు. ఒకానొక సందర్భంలో బీజేపీ జనసేన మాత్రమే ఎన్నికలకు వెళ్తాయని కూడా తేల్చి చెప్పారు.

అయితే పవన్ మాత్రం అటు బీజేపీ ఇటు టీడీపీ రెండు కావాలనే దొరణిలోనే ఉంటూ వచ్చారు. అయితే పేరుకే బీజేపీ జనసేన పొత్తులో ఉన్నప్పటికి రెండు పార్టీలు కలిసి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కార్యకలాపాలలో పాలుపంచుకోలేదు. దీంతో బీజేపీ జనసేన పొత్తు తాత్కాలికమే అనే సందేహాలు మొదటి నుంచి వ్యక్తమౌతూనే ఉన్నాయి. అయితే జనసేన దోస్తీని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని కమలనాథులు చెబుతూనే వచ్చారు. ఎందుకంటే జనసేన అండతోనే ఏపీలో బలపడాలనేది బీజేపీ ప్లాన్.

Also Read:మిస్టర్ ఇడియ‌ట్‌.. ఫస్ట్ లుక్

ఒకవేళ సింగిల్ గా బరిలోకి దిగాల్సి వస్తే డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన దోస్తీ బీజేపీకి ఎంతో కీలకం. కానీ ఆ పార్టీ ఊహించిని రీతిలో పవన్ టీడీపీతో పొత్తును కన్ఫర్మ్ చేశారు. దీంతో బీజేపీ ప్లాన్స్ అన్నీ పటాపంచలు అయ్యాయనే చెప్పాలి. టీడీపీతో గత పరాభావాల దృష్ట్యా ఆ పార్టీతో పొత్తుకు ససేమిరా అంటూ వస్తోంది. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి జై కొట్టలా ? లేదా సింగిల్ గా బరిలోకి దిగలా అనేది కాషాయ పార్టీని తీవ్రంగా కలవర పరుస్తోందట. మొత్తానికి పవన్ ఇచ్చిన స్ట్రోక్ తో బీజేపీ మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి.

Also Read:ప్రజలకు డబ్బు పంచిన ఏకైక హీరో

- Advertisement -