పవన్ లుక్ పై చర్చ

23
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ పై సోషల్ మీడియాలో కొత్త చర్చ నడుస్తోంది. తాజాగా పవన్ బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 గ్రాండ్ ఫినాలే లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో పవన్ ఓ హుడీ వేసుకొని స్టైలిష్ గా కనిపించాడు. అయితే పవన్ హెయిర్ స్టైల్ , ఫేస్ లో మాత్రం తేడా కనిపించింది. పవన్ లుక్ విషయంలో ఎప్పుడూ చర్చ ఉండదు. పవన్ హెయిర్ , ఫేస్ ఎప్పుడూ మెయిన్ టైన్ చేస్తూ ఉంటాడు. కాకపోతే హరి హర వీరమల్లు లుక్ తో పవన్ షో లో పాల్గొనడంతో ఇప్పుడు క్రిష్ పై ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

గతంలో బాలయ్య తో క్రిష్ తీసిన గౌతమీ పుత్ర శాతకర్ణి విషయంలోనూ బాలయ్య ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. అందులో బాలయ్య లుక్ పై క్రిష్ సరైన శ్రద్ద చూపలేదని మాట్లాడుకున్నారు. ఇప్పుడు పవన్ లుక్ విషయంలోనూ క్రిష్ ఎలాంటి జాగ్రత్త తీసుకోకుండా ఉంటున్నారని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

ఏదేమైనా పవన్ కొత్త లుక్ గురించి ఫ్యాన్స్ మధ్య గట్టి డిస్కషన్ నడుస్తుంది. క్రిష్ ఇకపై అయినా పవన్ లుక్ విషయంలో జాగ్రత్త వహిస్తే బాగుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకొని క్రిష్ ఇకపై వీరమల్లు లుక్ పై ఇంకాస్త ఫోకస్ పెడతారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి…

బుల్లితెరపై అదరగొట్టిన కాంతార…

దళపతి 67… లియో

చరణ్ సెంటిమెంట్ తో నాని?

- Advertisement -