పవన్, లోకేష్.. రెండు చోట్ల పోటీ?

29
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె దించాలని పట్టుదలగా ఉన్నాయి. ఇకపోతే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన పార్టీలు గట్టిగా కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు జనసేనాని. మరి ఈసారి కూడా రెండు చోట్ల పోటీ చేస్తారా లేదా అనే వాదన జరుగుతోంది. అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆయన మరోసారి రెండుచోట్ల పోటీ చేసే ఆలోచనలోనే ఉన్నారట. గతంలో పోటీ చేసిన భీమవరంతో పాటు ఈసారి ఉభయ గోదావరి జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట..

ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన ఎంతో కొంత గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే భీమవరంలో ఫలితం తేడాకొట్టిన రెండో చోట సత్తా చాటవచ్చనే ప్లాన్ లో పవన్ ఉన్నట్లు వినికిడి. ఇక టీడీపీ నుంచి నారా లోకేష్ కూడా రెండు చోట్ల పోటీ చేయబోతున్నారని గత కొన్నాళ్లుగా వార్తాలు చక్కర్లు కొడుతున్నాయి. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్ ఓటమిని మూటగట్టుకున్నారు. ఈసారి కూడా మంగళగిరి నుంచే పోటీ చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు లోకేష్.. అయితే సారి కూడా ఓడిపోతే కష్టమని భావించి ప్రత్యామ్నాయంగా రెండో స్థానంపై దృష్టి సరిస్తున్నాట్లు టాక్ నడిచింది. అయితే అలాంటిదేమీ లేదని తాను ఒకే స్థానంలో కేవలం మంగళగిరి లోనే పోటీ చేయబోతున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికి లోకేష్ ముందు రెండు స్థానాల ప్రతిపాదనను ముందుంచుతుందట పార్టీ అధిష్టానం. మరి అటు పవన్ లోకేష్ పోటీ చేసే స్థానాలపై పూర్తి స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Also Read:Mahesh:మహేష్ రు’బాబు’.. కిక్కివ్వాట్లేదా?

- Advertisement -