- Advertisement -
సినిమా థియేటర్ల వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ప్రజలు సినిమా థియేటర్లకు రావాలంటే తినుబండారాలు, శీతల పానీయాలు, వాటర్ బాటిల్స్ ధరలను నియంత్రించాలి అన్నారు.
భవిష్యత్తులో విడుదలయ్యే ఏ సినిమా అయినా, అది నా హరిహర వీరమల్లు అయినా సరే వ్యక్తిగతంగా నిర్మాత ఒకరు రావడం కాదు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలి అన్నారు.
ఇటీవల సంచలనంగా మారిన థియేటర్ల బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు. పవన్ చెప్పినట్లుగానే జనసేన నేత అత్తి సత్యనారాయణపై వేటు పడింది. థియేటర్ల బంద్ పిలుపు ప్రతిపాదన చేసిందే సత్యనారాయణ అంటూ ఆరోపణలు రావడంతో పార్టీ సభ్యత్వంతో పాటు రాజమండ్రి నగర నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది జనసేన.
Also Read:Indira Park: ఆటో డ్రైవర్ల ధర్నా
- Advertisement -

