పవన్‌ సినిమా మళ్ళీ రీషూట్‌…..

203
Pawan Kalyan's Katamarayudu to be re-shot
- Advertisement -

పవన్ కాటమరాయుడు మానియాతో టాలీవుడ్ రికార్డులు బద్దలవుతున్నాయి. కాటమరాయుడికి సంబంధించి ఏ చిన్న ఫోటోఐనా ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఏ సినిమా దక్కించుకోని విధంగా సోషల్ మీడియాలో కాటమరాయుడు తెగ ట్రెండవుతోంది. సినిమా ఫస్ట్ లుక్‌, మూవీ మోషన్ పోస్టర్‌ నుంచి ట్రైలర్‌ వరకు  విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది కాటమరాయుడు.
Pawan Kalyan's Katamarayudu to be re-shot
అయితే కాటమరాయుడు సినిమా దాదాపు షూటింగ్‌ పూరైంది. సినిమాలో పవర్‌స్టార్‌ పార్ట్‌ మొత్తం కంప్లైట్‌ అయ్యినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా  ఎడిటింగ్‌ వర్క్‌ నడుస్తుందట. దీంతో ఈమూవీని మార్చి 24న రిలీజ్‌ చేసేందుకు సన్నహాలు చేస్తున్నాడట చిత్ర నిర్మాత శరత్‌మారార్‌. కానీ ఈసినిమాకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. కాటమరాయుడు సినిమాలోని కొన్ని సన్నివేశాలని మళ్లీ చిత్రీకరించాలని పవన్‌ ఆర్డర్‌ వేశాడట. అమెరికా పర్యటన నుంచి వచ్చిన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాన్‌ కాటమరాయుడి ఫస్ట్‌ కాపీని చూశాడట. అందులోని కొన్ని సన్నివేశాలు అనుకున్నట్టు రాలేదని పవన్‌ భావించాడట. దీంతో మరోసారి సినిమాను రీషూట్‌ చేయాలని పవన్‌ చిత్రయూనిట్‌కు ఆర్డర్‌ వేసినట్లు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Pawan Kalyan's Katamarayudu to be re-shot
మరో రెండు రోజుల పాటుగా ఆ బాగా రాని సీన్ల ను చిత్రీకరించాలని చెప్పాడట. దానికి తగినట్టు హీరోయిన్‌ శృతిహాసన్‌ ఇతర ఆర్టిస్టుల డేట్లను తీసుకోవాల్సిందిగా సూచించడట.అయితే వారి డేట్లు దొరకడం కష్టతరమవుతుందట చిత్ర యూనిట్‌ చెబుతొంది. ఎలాగోలా వారి డేట్లను సంపాదించి రీషూట్‌ చేయాల్సిందేనని పవర్‌ స్టార్‌ అంటున్నాడట. రీషూట్‌కు వారి డేట్లు దొరుకుతాయా లేదా అనే సందేహం మాత్రం నెలకొంది. రీషూట్‌ అనుకున్న టైంకు పూర్తై అయిన…. మర్చి24న సినిమా విడుదలవుతుందా లేదా అనేది ప్రశ్నర్థకంగా మారింది. మొత్తం మీద పవన్‌కళ్యాన్‌ కు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అని ఈ న్యూస్‌ విన్న నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాటమరాయుడు రీషూట్‌ పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్‌కు బ్యాడ్‌న్యూస్‌ అనే చెప్పవచ్చు.

- Advertisement -