పవన్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స..

1
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ముంబయిలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. శనివారం ఉదయం వైద్య నిపుణుల బృందం ఆయనకు ఈ ఆపరేషన్ నిర్వహించింది.

గత పదేళ్లుగా రాజకీయాల్లో నిరంతరం పర్యటనలు, సుదీర్ఘ ఎన్నికల ప్రచారాల సమయంలో అభిమానులు, కార్యకర్తలు ఆయనకు షేక్‌హ్యాండ్ ఇస్తూ చేతులు పట్టి గట్టిగా లాగడంతో పవన్ కళ్యాణ్ రెండు భుజాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనివల్ల ఆయన రెండు భుజాలకు ‘రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్’ భుజం కండరాలు, కనెక్టింగ్ కణజాలాలు దెబ్బతినడం) ఏర్పడ్డాయి. ఈ సమస్య గత కొంతకాలంగా ఆయనను తీవ్రంగా వేధిస్తోంది.

దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ అనంతరం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

పవన్ కళ్యాణ్‌కు రెండు భుజాలకూ ఈ సమస్య ఉన్నందున, ప్రస్తుతానికి కేవలం కుడి భుజానికి మాత్రమే శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఈ గాయం నుండి ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత, దాదాపు రెండు నెలల వ్యవధి అనంతరం ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌కు ఆపరేషన్ జరిగిందనే వార్త తెలియడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కూటమి నేతలు ఆకాంక్షిస్తున్నారు.

Also Read:కామిశెట్టి దర్శకత్వంలో రోషన్!

- Advertisement -