జనసేనాని కీలక నిర్ణయం..

244
Pawan Kalyan Tweets Against Casting Couch
- Advertisement -

త్వరలో చిత్రపరిశ్రమ ఆడపడుచులకు ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటుకు రంగం సిద్దమవుతోందంటూ ట్వీట్‌ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ ట్వీట్‌ తో తన కీలక నిర్ణయాన్ని ప్రకటించారు పవన్‌. అయితే ఆడపడుచులకు ఆత్మగౌరవ పోరాట సమితి కి జనసేన వీర మహిళా విభాగం అండగా ఉంటుందని కూడా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా మనల్ని, మన తల్లుల్ని, ఆడపడుచుల్ని తిట్టే పేపర్లు ఎందుకు చూడాలి..? అలాంటి వాళ్ళటీవీలు ఎందుకు చూడాలంటూ ప్రశ్నించారు. కాగా అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి చట్టాలు తేవాలంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

తన తల్లిని దూషించిన వారు రహస్యంగా క్షమాపణలు చెబుతున్నారని, పబ్లిక్‌లో నోటికొచ్చినట్టు తిట్టి, ఇప్పుడు ప్రైవేటుగా క్షమాపణలు చెబుతున్నారని తెలిపారు. కానీ ఇలాంటివి తన దగ్గర కుదరవని, గత ఆరు నెలలుగా తన తల్లిని, అభిమానులు, అనుచరుల్ని నోటికొచ్చినట్టు తిట్టారని, ఇంతటి నీచబుద్ది ఉన్న మీరు ఇప్పుడు రహస్యంగా క్షమాపణలు చెప్తారా అంటూ ప్రశ్నించారు.

త్వరలో ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితిని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించిన పవన్‌..ఈ (సోమవారం) సాయంత్రంలోపు చిత్తూరు జిల్లాలో తన మూడు రోజుల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటిస్తానన్నారు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -