పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న రెండేళ్లు వరుస సినిమాలతో బిజీగా మారనున్నాడు. 2019 ఎన్నికల్లో పాల్గొనే ఆలోచన ఉన్న పవన్, ఈ లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమా చేస్తున్న పవన్,,,ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఏఎమ్ రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో ఓ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాడు. దీంతోపాటు టాలీవుడ్ ప్రేక్షకులను ఎప్పటి నుంచే ఊరిస్తున్న త్రివిక్రమ్ తో కూడా సినిమాను స్టార్ట్ చేశాడు.
పవన్‌కు జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన త్రివిక్రమ్ తో ముచ్చటగా మూడో సినిమాను మొదలెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు. నవంబర్ 5న లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో పట్టాలెక్కనున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఇప్పటి నుంచే నటీనటుల ఎంపికపై దృష్టి సారించాడట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడు సినిమాలు చేసిన టాలీవుడ్ బబ్లి బ్యూటీ సమంతకు మరోసారి హీరోయిన్గా అవకాశం వరించినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అత్తారింటికి దారేదిలో ఇద్దరి జోడికి మంచి గుర్తింపు రావడంతో,,మరోసారి అదే జంటను రిపీట్ చేయబోతున్నాడు. ఇక సమంతతో పాటు మరో హీరోయిన్గా అ,ఆ ఫేం,,అనుపమ పరమేశ్వరన్‌కు కూడా అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.