పవన్ ఫిక్స్.. పోటీ అక్కడి నుంచే?

24
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై గత కొన్నాళ్లుగా సందిగ్ధత కొనసాగుతోంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసిన పవన్.. రెండు చోట్ల కూడా ఘోర ఓటమిని చవిచూశారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడం బహుశా పవన్ ను అత్యంత బాధించే అంశం. అందుకే ఈసారి తాను పోటీ చేసే స్థానంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు జనసేనాని. అన్నీ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని పోటీ చేసే స్థానాన్ని ఎంచుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే కాపు సామాజికవర్గం అధికంగా ఉండే నియోజక వర్గాలను జల్లెడ పట్టే పనిలో ఉన్నారట. ప్రస్తుతం పవన్ కాంపౌండ్ నుంచి మూడు నియోజకవర్గాల పేరు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో పోటీ చేసిన గాజువాక, భీమవరంతో పాటు కాకినాడ పై కూడా పవన్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. .

ముఖ్యంగా కాకినాడలో కాపుసామాజిక వర్గం అధికంగా ఉంది. పైగా అక్కడ పవన్ అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. అందుకే ఈసారి కాకినాడ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు టాక్. అయితే గతంలో మాదిరి రెండు స్థానాల్లో పవన్ పోటీ చేస్తారా లేదా ఒకే స్థానానికే పరిమితం అవుతారా అనే దానిపై ఇంకా కన్యూజన్ నడుస్తోంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి కూడా పవన్ రెండు చోట్ల పోటీ చేసే అవకాశాలే ఎక్కువ అని టాక్. భీమవరం, మరియు కాకినాడ లో ఆయన పోటీ చేసే ఛాన్స్ ఉందట. మరి పవన్ పోటీ చేసే స్థానాలపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇకపోతే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కేటాయించే సీట్లపై కూడా ముమ్మర కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఈసారి ఎన్నికల్లో పవన్ ఎంతవరకు సత్తా చాటుతారో చూడాలి.

Also Read:సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ అభ్యంతరం

- Advertisement -