పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఒకటే సినిమా ఉంది. క్రిష్ డైరెక్షన్ లో ‘హరి హర వీరమల్లు’ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టేశాడట. అవును త్వరలోనే హరీష్ శంకర్ సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట పవన్. ఈ సినిమా ముందుగా ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ కథ తో తెరకెక్కడం లేదని పవన్ సొంత కథతో ఈ కాంబో సినిమా రానుందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
ఇక తాజాగా సుజీత్ కి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుజీత్ ఇటివలే పవన్ ను ఓ పవర్ ఫుల్ కథతో అప్రోచ్ అయ్యాడని తెలుస్తుంది. కథ నచ్చడంతో పవన్ వెంటనే ఈ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలుస్తుంది. అయితే ఈ కాంబో సినిమా తేరి రీమేక్ చేయనుందనే టాక్ కూడా వినిపిస్తుంది. కథేదైనా ఈ కాంబో సినిమా మాత్రం పక్కా అంటున్నారు. సుజీత్ కి సాహో కి ముందే అడ్వాన్స్ ఇచ్చాడు దానయ్య. సో ఈ కాంబో సినిమాను డీవీవీ దానయ్య నిర్మించే అవకాశం ఉంది.
హరి హర వీరమల్లు షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాతో పాటే పవన్ హరీష్ , సుజీత్ సినిమా షూటింగ్ కూడా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడట పవన్. అన్నీ కుదిరితే డిసెంబర్ లో పవన్ రెండు అప్ కమింగ్ సినిమాలు సెట్స్ పైకి వస్తాయి. ఈ లోపు పవన్ పొలిటికల్ గా ఏదైనా బిజీ అయితే చెప్పలేం.
ఇవి కూడా చదవండి..