- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు 85 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.
వకీల్ సాబ్ చిత్రాన్ని ఏప్రిల్ 30(నేడు) నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. 50 రోజుల తర్వాత వకీల్ సాబ్‌ను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు కాని, పరిస్తితుల వలన ముందే స్ట్రీమిగ్ చేయక తప్పలేదు.
ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కాగా, అశేష ప్రేక్షకాదరణ పొందింది. 85 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తెలుగులో బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా నిలిచింది. గతంలో అత్తారింటికి దారేది చిత్రం 82 కోట్లు వసూలు చేస్తే, ఇప్పుడు వకీల్ సాబ్ ఆ రికార్డ్ బ్రేక్ చేసింది.
- Advertisement -