- Advertisement -
తాను సినిమా డైలాగ్‌లు చెప్పనని తెలిపారు ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లా సభలో మాట్లాడిన పవన్.. సింహం గడ్డం గీసుకుంది, నేను గీసుకోలేదు అనే డైలాగ్‌లు సినిమాలో కూడా చెప్పడానికి నేను ఇబ్బంది పడుతాను అన్నారు.
మెడకాయలు కోసేస్తాం అంటే చొక్కా ఇప్పి చూపిస్తామా? , నాలుగు దశాబ్దాల క్రితం నేను ప్రకాశం జిల్లా కనిగిరిలో పెరిగాను అన్నారు. తానెప్పుడూ టీడీపీని తక్కువ చేసి మాట్లాడలేదు అన్నారు.
చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రం ఇంత ప్రణాళికాబద్ధంగా నడిచేది కాదు అన్నారు. కూటమి ప్రభుత్వంలో అందరూ సమానమే, అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అవుతుంది…2029లో జగన్ ఎలా గెలుస్తాడో చూస్తాను అని సవాల్ విసిరారు.
Also Read:కాంగ్రెస్ డిక్లరేషన్లు..డెత్ డిక్లరేషన్లు!
- Advertisement -

