తొలిసారి సినిమా ప్రమోట్ చేస్తున్నా:పవన్

9
- Advertisement -

జీవితంలో మొట్టమొదటి సారి నా సినిమా ప్రమోట్ చేస్తున్నాను అని తెలిపారు ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్. పొలిటికల్‌గా నాకు చాలా పేరున్నా, దేశవ్యాప్తంగా నేను తెలిసినా.. సినిమా పరంగా నేను కొందరు హీరోల కంటే చాలా తక్కువ అన్నారు. పవన్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’జూలై 24న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సందర్భంగా హరిహర వీరమల్లు టీమ్ స్పెషల్ ప్రెస్‌మీట్‌ నిర్వహించగా మాట్లాడన పవన్… వేరే హీరోలకు వచ్చినంతగా నాకు కలెక్షన్స్ రావు.. ఎందుకంటే నా దృష్టి ఎప్పుడు సినిమాల మీద పెట్టలేదు నేను, సొసైటీ మరియు రాజకీయాల మీద పెట్టానని చెప్పారు. చిరంజీవి కొడుకైన, నా కొడుకైన సరే టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడ లేరు అన్నారు.

Also Read:ఫీల్ గుడ్‌మూవీ..’కొత్తపల్లిలో ఒకప్పుడు’

రాజకీయాల్లో కులాలు, మతాలు మీద కొట్టుకుంటాము.. కానీ సిని ఇండస్ట్రీలో అలా ఉండదు అన్నారు. హరిహర వీరమల్లు సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది…ఒక సినిమా చేయాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలి అన్నారు. ఏఎం రత్నం లాంటి నిర్మాతతో సినిమా చేయడం సంతోషంగా ఉంది అన్నారు. పవన్ కళ్యాణ్‌తో నటించే అదృష్టం ఈ సినిమాతో తనకు దొరికిందని సంతోషం వ్యక్తం చేశౄరు నిధి అగర్వాల్.

- Advertisement -