బియ్యం అక్రమ రవాణా..టీడీపీ ఎమ్మెల్యేపై పవన్‌ ఫైర్

3
- Advertisement -

రేషన్ బియ్యం అక్రమ రవాణా.. టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు.

పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించారు. ఇటీవల పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో అక్రమ బియ్యం తరలింపును అడ్డుకొని పోర్టులోనే ఉంచారు అధికారులు.

కాకినాడ పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్ట్ లో పౌర సరఫరాల శాఖ పట్టుకున్న అక్రమ బియ్యాన్ని, వాటిని తరలిస్తున్న షిప్ ను మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్, కాకినాడ సిటీ ఎంఎల్ఏ కొండబాబు , సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ , పోర్ట్ అథారిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు పవన్.

Also Read:టీడీపీతో కూడా జై తెలంగాణ అనిపించాం!

- Advertisement -