మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురంలో 42 మంది అనాథ పిల్లలకు తన సొంత ఖర్చులతో వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఒక్కో చిన్నారికి నెలకు రూ.5 వేల చొప్పున సాయం చేస్తానని..ఇకపై ప్రతి నెల అనాథ పిల్లలకు వారి ఇంటి వద్దే సాయం అందిస్తానని తెలిపారు.
తన వేతనంలో మిగిలిన మొత్తాన్ని కూడా అనాథల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తానని ప్రకటించారు. తాను పదవిలో ఉన్నంతకాలం ఇదే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
అలాగే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మొక్కులు చెల్లించి తన పింఛను డబ్బుతో అమ్మవారికి గరగ చేయించిన వృద్దురాలిని కలిశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తఇసుకపల్లికి చెందిన పోతులపేరంటాలుకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం.
ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గెలవాలని తన పింఛను డబ్బులతో అమ్మవారికి గరగ చేయించి మొక్కులు చెల్లించింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన క్యాంప్ కార్యాలయానికి పేరంటాలును పిలిపించుకున్నారు. ఆమెతో ముచ్చటించి కలిసి భోజనం చేసి అనంతరం ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.
Also Read:భారత ఆర్మీకి అండగా ఉందాం

