ప్రతీకారం ఇలా తీర్చుకున్నారు…

193
Online News Portal
pawan kalyan selfie with mega family
- Advertisement -

దీపావళి సందర్భంగా ‘మెగా’ నటులంతా కలిసి దిగిన ఓ ఫొటోను ‘ఖైదీ నంబర్‌ 150’ ట్విట్టర్‌ ఖాతా ద్వారా రామ్‌చరణ్‌ అభిమానులతో పంచుకున్నారు. ‘ఖైదీ నంబర్‌ 150’ దీపావళి ఇలా జరుపుకొన్నారు అంటూ ఫొటోను ట్వీట్‌ చేశారు. చిరంజీవి స్ఫూర్తితోనే ఆయన కుటుంబం నుంచి వచ్చిన నట వారసులు అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, అల్లు శిరీష్‌, వరుణ్‌తేజ్‌, నిహారికలు. ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఎవరి శైలిలో చిత్రాలను చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఫోటోలో ఒకరు మిస్సయారన్న సంగతి మీకు తెలిసిందే. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఫోటోని చూసి మెగా అభిమానులు ఎంత సంతోష పడ్డారో.. పవర్ స్టార్ అభిమానులు కూడా అంతే స్థాయిలో బాధపడ్డారు. అందుకు నిదర్శనమే ఈ ఫ్యాన్ మేడ్ ఫోటో.

mega

మెగా ఫ్యామిలీలో పవన్ లేని లోటుని తీర్చడానికి మరో ఫోటో సిద్దం చేశాడు ఆ అభిమాని. పవన్ కళ్యాణ్ మెగా కుటుంబంతో సెల్ఫీ దిగుతున్నట్టుగా మార్చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఈ విధంగా అయినా పవన్ ని మెగా ఫ్యామిలీ తో కలసి చూస్తున్నందుకు మెగా పవర్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.అయితే, ఈ ఫొటోకి విభిన్నమైన కామెంట్స్ కూడా పడుతున్నాయి. అల్లు ఫ్యామిలీని కావాలనే తప్పించి తమ కోపాన్ని తీర్చుకుంటున్నారా అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక అల్లు అర్జున్‌ ఒకసారి పవన్‌ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే మాట్లడనని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. మెగా హీరోలు కలిసున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

- Advertisement -