ప్రతీ మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు:పవన్

9
- Advertisement -

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరద ప్రభావంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలను అధికారులు వివరించారు.

ప్రతి జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు, జిల్లా పరిషత్తుల్లో అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అన్నారు పవన్. మండల స్థాయి, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తక్షణ స్పందనకు బృందాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు.

ప్రతి 6 గంటలకు ఒకసారి టెలీ కాన్ఫరెన్సుల ద్వారా అన్ని జిల్లాల బృందాలతో పర్యవేక్షణ, సమన్వయం చేసుకోవడం నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పిన పవన్… ప్రభావిత ప్రాంతాల కోసం 300 ప్రత్యేక బృందాలకి అవసరమైన సిబ్బందినీ, వారికి అవసరమైన సామగ్రిని సిద్ధం చేయడమైనది. ప్రతి బృందంలో ముగ్గురు పారిశుధ్య కార్మికులు (OHSR శుభ్రం చేయగల సామర్థ్యంతో), 1 ఎలక్ట్రీషియన్, 1 ప్లంబర్, సంబంధిత పరికరాలు (హై ప్రెషర్ క్లీనింగ్ యంత్రాలు, కత్తెరలు, తాడు, ఎలక్ట్రీషియన్ మరియు ప్లంబింగ్ సాధనాల కిట్లు) మరియు పదార్థాలు (బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ లిక్విడ్, మలతైన్, సోడియం క్లోరేట్, ఫినాయిల్ మొదలైనవి) ఉంటాయన్నారు.

నిల్వ నీటి ద్వారా, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నిరోధించేందుకు కాలువలు, ట్యాంకుల సమయానుకూల శుభ్రతను PROne డాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షించబడుతుందని..తక్షణంగా చెత్త కుప్పలను తొలగించడం కూడా అత్యవసరమని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో తాగు నీరు క్యాన్లు, తాగు నీటి ప్యాకెట్లు సరఫరా చేయడం జరుగుతోందన్నారు.

Also Read:హ్యాపీ బర్త్ డే..డిప్యూటీ సీఎం పవన్

- Advertisement -