కళాపురం కోసం భీమ్లానాయక్!

28
- Advertisement -

పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు కరుణ కుమార్‌.అయితే ఈసారి భిన్నంగా కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో ‘కళాపురం’ ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆగస్టు 26న సినిమా రిలీజ్‌ కానుండగా ఆర్4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌జనీ తాళ్లూరి.. కళాపురం సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు పవన్‌. ఇక 1 నిమిషం 57 సెక‌న్ల వ్య‌వ‌ధి ఉన్న ఈ ట్రైల‌ర్‌లో కామెడీ కోణంలో సినిమాని తెరకెక్కించారని తెలుస్తుంది. ఓ దర్శ‌కుడు, నిర్మాత క‌లిసి ఒక సినిమాను చేయాల‌నుకుంటారు. అయితే తాను ఉంటున్న క‌ళాపురం గ్రామంలో కొంత సినిమా షూటింగ్ చేయాల‌నే కండీష‌న్ మీద నిర్మాత సినిమాను స్టార్ట్ చేస్తాడు.

అయితే డ‌బ్బు కోసం మ‌ధ్య‌లో పోలీసులు, విల‌న్ ఎంట్రీ ఇస్తారు. అలాంటి ప‌రిస్థితుల్లో ద‌ర్శ‌కుడు, నిర్మాత క‌లిసి సినిమాను ఎలా పూర్తి చేశార‌నేదే సినిమా. స‌త్యం రాజేష్ ఇందులో డైరెక్ట‌ర్ పాత్ర‌ను పోషించారు. ఇక పవన్ ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేయడంతో మరింత పబ్లిసిటీ వచ్చింది.

- Advertisement -