మనస్సు మార్చుకున్న పవన్‌..!

215
- Advertisement -

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయ సభలు.. ఇటు సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ప్రజా స‌మ‌స్యల‌పై పోరాటంతో పాటు, పార్టీని బ‌లోపేతం చేయాల‌ని పవణ్ కళ్యాణ్‌ నిర్ణయించుకున్నారు. అయితే ఇంకో మూడు నెలల్లో ఫుల్ టైమ్ రాజికీయాల్లోకి వచ్చేస్తా అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ లెక్కన చూస్తే మనోడు మరో సినిమా చేసి ఇక సినిమాలకు చెక్ పెట్టేస్తాడనే అందరూ అనుకుంటున్నారు. చేతిలో ఉన్న త్రివిక్రమ్ సినిమా ఒక్కటీ పూర్తి చేసేసి.. జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇక సినిమాలు టెంపరరీ లేదా పర్మినెంట్ గా గుడ్ బాయ్ చెప్పేస్తాడని అందరూ అనుకుంటన్నారు.

Pawan Kalyan Political And Movie Career

అయితే పవన్ నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకుంటాడో లేదో తెలియదు కాని.. ఇప్పుడు మాత్రం పవన్ గురించి మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. అది ఎంటనేగా మీ సందేహం.. సినిమాలను వదిలేద్దాం అనుకున్న పవన్ మనస్సు మార్చుకున్నాడట. ఈ మధ్యన కొందరు సన్నిహితులు చేసిన జ్ఞానోదయం వలన.. మనోడు ఇప్పుడు సినిమాలను కంటిన్యూ చేద్దామనే అనుకుంటున్నాడట. ఎందుకంటే సినిమాలను వదిలేస్తే పార్టీని రన్ చేయడానికి కావాల్సిన మూల విత్తు సరిపోదు. అటు ఫండ్స్ వసూలు చేయక.. ఇటు తను సినిమాలు చేయక.. అప్పుడు పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది కాబట్టి.. పవన్ సినిమాల్లో కంటిన్యూ అవ్వాలనే మనస్సు మార్చుకున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ మాత్రం త్రివిక్రమ్ సినిమాను యుద్దప్రాతిపదికను పూర్తి చేస్తున్నాడట. ఆల్రెడీ ఆ మధ్యన క్రొయేషియా వెళ్లొచ్చిన టీమ్.. ఇప్పుడు మరోసారి విదేశీ పయనానికి తయారవుతోంది. ఈ ట్రిప్పుతో చాలా ముఖ్యమైన సీన్లను కూడా పూర్తి చేసేస్తారట.

- Advertisement -