ప‌వ‌న్ ‘పింక్’ రీమేక్ లుక్ లీక్..!

232
pawan
- Advertisement -

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత సినిమాలకు దూరం అయిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఇన్నాళ్లకు కెమెరా ముందుకు వచ్చాడు. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ తో పవన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా పింక్ రీమేక్ లో పవన్ అంటూ వార్తలు వచ్చాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సందర్బం రానే వచ్చింది. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ నేడు కెమెరా ముందుకు రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొదటి రోజు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా లొకేషన్ లో పవన్ కళ్యాణ్ ఫొటో లీక్ అయ్యింది.

pawan-shooting

తాజాగా ఈ చిత్ర షూటింగ్ లొకేష‌న్‌కి సంబంధించి ప‌లు ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ ఫోటోల‌లో ప‌వ‌న్‌ని చూస్తుంటే ఇప్పుడున్న లుక్‌తోనే సినిమాలోను న‌టిస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ఈ చిత్రంలో పవన్‌ అమితాబ్ పోషించిన పాత్ర‌ని ఇక్క‌డ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోషిస్తున్నారు. ప‌వ‌న్ 26వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం లాయ‌ర్ సాబ్ అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎంసీఏ ఫేం వేణు శ్రీరామ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం ప‌ది రోజుల పాటు ప‌వ‌న్ కాల్షీట్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

- Advertisement -