తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, EO శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
సారీ చెప్పడానికి నామోషీ ఎందుకు.. ఇలాంటి వారికి కాకపోతే ఇంకెవరికి చెప్తాం అన్నారు. అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నారు అన్నారు. పవన్ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తే మగతనం కాదు.. అమ్మ లేనిదే సృష్టి లేదు అన్నారు. మగతనం చూపించాలంటే జిమ్నాస్టిక్స్ చేయండి, ఆర్మీలో చేరండి…అమ్మాయిల దగ్గర మగతనం చూపిస్తే తొక్కి నారా తీస్తాం అన్నారు. క్రిమినల్స్‌కి కులం లేదు.. ప్రజాప్రతినిధులకు కులం లేదు.. తప్పు చేసిన ఎవడినైనా శిక్షించండన్నారు.
Also Read:చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలే: జగన్