Pawan:ఇన్‌స్టాలోకి పవన్‌

62
- Advertisement -

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ ఎక్కడుంటే అక్కడ జనమే. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు,వారాహి యాత్రతో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో పవన్ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పవన్‌కు ట్విట్టర్‌లో 5.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ ఇలా చేరాడో లేదో లక్షల్లో ఫాలోవర్స్‌ వచ్చి చేరుతున్నారు. అభిమానులు, కార్యకర్తలకు నిత్యం టచ్లో ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో ఇన్‌స్టాలోకి పవన్‌ అడుగుపెట్టారు.

Also Read:పొద్దుతిరుగుడుతో ఈ సమస్యలు దూరం..

ఇక ప్రస్తుతం పవన్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో సాయిధరమ్ తేజ్‌తో కలిసిన నటించిన బ్రో త్వరలోనే విడుదల కానుంది. ఇటీవలే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌రాగా సుజీత్‌తో ఓజీ, హరీష్‌ శంకర్‌తో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ,క్రిష్‌తో పాన్‌ ఇండియా సినిమా హరిహర వీరమల్లు చేస్తున్నారు.

- Advertisement -