ఉగ్ర కదలికలపై అప్రమత్తంగా ఉండాలి

9
- Advertisement -

ఉగ్ర కదలికలపై అప్రమత్తంగా ఉండాలి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర నిఘా అవసరమని లేఖలో పేర్కొన్నారు పవన్.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖ రాశారు. మరీ ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన చేశారు.

విజయనగరంలో ఐసిస్‌తో సంబంధాలున్న వ్యక్తి అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు పవన్ కళ్యాణ్.

Also Read:డిక్లరేషన్‌ సరే..డెడికేషన్ ఏది?:హరీష్

- Advertisement -