కూటమి శ్రేణులకు పవన్‌ కీ సూచన

4
- Advertisement -

జనసైనికులు, కూటమి శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచన చేశారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేవారి ఉచ్చులో పడవద్దు అని సూచించారు. కుట్రలు చేసేవారి కుయుక్తులను పదేళ్లుగా చూస్తున్నాం అన్నారు.

రెచ్చగొట్టేలా, అభ్యంతరకరంగా మాట్లాడే వారిపై చట్టప్రకారం ముందుకెళ్లాలి.. ఎవరూ ఆవేశాలకు లోనై ఘర్షణకు తావీయవద్దు.. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టాలి అన్నారు.

వారి దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా, చట్టప్రకారం తిప్పికొడదాం.. సామాజిక మధ్యమాల్లో అసభ్యంగా మాట్లాడుతున్నారు.. మచిలీపట్నం ఘటనపై అంతర్గత విచారణ చేయాలని పార్టీ నేతలకు సూచించానని పవన్ కల్యాణ్ చెప్పారు.

Also Read:NBK:క్రిష్‌తో బాలయ్య!

- Advertisement -