మార్చిలో కాటమరాయుడు…

246
online news portal
- Advertisement -

సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ లాంటి డిజాస్టర్‌ మూవీ తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న సినిమా కాటమరాయుడు. చాలా నెలల క్రితమే అనౌన్స్‌ అయిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇక ఈసినిమాలో పవన్‌ కళ్యాణ్‌ పంచెకట్టుతో కనిపించడంతో పాటు, మీసకట్టును కూడా కొత్తగా కనిపించేలా ప్లాన్‌ చేశారట. వచ్చే ఏడాది మార్చి 29న తెలుగు నూతన సంవత్సరాది (ఉగాది) కానుకగా ‘కాటమరాయుడు’ రిలీజ్‌ కానున్నట్లు ఈ చిత్ర యూనిట్‌ తెలిపింది.

online news portal

ఈ సినిమాపై ఫిల్మ్‌ నగర్‌లో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి… తమిళంలోని అజిత్‌ హీరోగా వచ్చిన ‘వీరమ్‌’ సినిమాను తెలుగులో కాటమరాయుడిగా రీమేక్‌ చేస్తున్నారనేది టాక్. ఈ రీమేక్‌ విషయాన్ని కాటమరాయుడు టీం మాత్రం అఫీషియల్‌గా కన్ఫామ్‌ చేయలేదు.. కానీ పవన్‌ లుక్‌ మాత్రం తెల్ల షర్ట్‌, పంచతో అచ్చం అజిత్‌ వీరంలో ఉన్నట్లే ఉంది.

అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌.. ఒక మరదలు.. నలుగురు తమ్ముళ్ళు… ఇలా ఆ సినిమాలో ఉన్న క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయట. ఇక ఈసినిమాలో మరో ఇద్దరు చిన్న హీరోయిన్లు కూడా నటిస్తున్నారట. అలాగే పెళ్లిచూపులు ఫేం విజయ్‌..మరో హీరో కమల్‌ కామరాజు..పవన్‌ కళ్యాణ్‌కు తమ్ముళ్లుగా నటిస్తున్నారు. కాటమరాయుడులో శృతిహాసన్‌ రెండోసారి పవన్‌కు జోడిగా నటిస్తుంది.

online news portal

కిశోర్ పార్థసాని ( డాలీ) డైరెక్షన్‌ చేస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రాన్ని నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌వ‌న్ స‌న్నిహితుడు శ‌ర‌త్‌మ‌రార్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూర్చుతున్నాడు. దీపావళికి కానుకగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ విడుదల చేయాలని ఈ చిత్ర యూని భావిస్తున్నట్టు సమాచారం. షూటింగ్‌ పూర్తి కాకముందే ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ 15కోట్లకు అమ్ముడు పోయినట్టు ఫిల్మ్‌నగర్‌ వర్గాల టాక్‌. గతంలో డాలీ దర్శకత్వంలోని గోపాల.. గోపాల సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ నటించిన విషయం తెలిసిందే.

online news portal

కాటమరాయుడు సినిమా తర్వాత పవన్‌ మాటల మాంత్రికుడు ‘తివిక్రమ్’తో సినిమా చేయనున్నారు. అనంతరం మరో రెండు సినిమాలకు ‘పవన్’ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. ఈ సినిమాలన్నీ 2018 నాటికి పూర్తి కావాలని పవన్ కళ్యాణ్‌ ప్లాన్ వేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీతో ‘పవన్’ రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలు మొదలయ్యే సమయానికి బిజీగా ఉండాల్సినవసరం ఉంటుందని, అందుకే వీలైనన్నీ సినిమాలు ఈ రెండు సంవత్సరాల్లోనే చేయాలని ‘పవన్’ అనుకుంటున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -